హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన బసవ సిద్ధార్థ అనే వ్యక్తిని హైదరాబాదు పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. ప్రవీణ్ రావు, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన సంఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాప్ కోసం సిద్ధార్థ మనుషులను సరఫరా చేశాడు. 

సిద్ధార్థ కృష్ణా జిల్లాకు చెందినవాడు. ప్రవీణ్ రావు, ఆయన సోదరులను ఈ నెల 5వ తేదీన కిడ్నాప్ చేసిన సంఘటనలో గుంటూరు శ్రీను కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. గుంటూరు వెసిన స్కెచ్ ను గినట్లు సిద్ధార్థ బౌన్సర్లను సరఫరా చేశాడు. 

గోవాలో దొరికిన సిద్ధార్థ గురించి హైదరాబాదు పోలీసులు కృష్ణా జిల్లాలోని విజయవాడ, కొండపల్లి ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రాముడుపాలెం గ్రామం. ఐదేళ్ల క్రితం గ్రామాన్ని వదిలేసి విజయవాడ వచ్చాడు. 

విజయవాడలో అతను అ ప్రైవేట్ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో వివిధ జిమ్ముల్లో ట్రైనర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు పరిచయమయ్యాడు. పీవీపీ మాల్ సమీపంలో ఉండే భార్గవ్ రామ్ సమీపంలోని ఓ జిమ్ కు ప్రతి రోజూ వెళ్లేవాడు.

ఆ జిమ్ములోనే సిద్ధార్థ పనిచేసేవాడు. భార్గవ్ రామ్ అఖిలప్రియ భర్త అని తెలుసుకున్న సిద్ధార్థ పరిచయం పెంచుకున్నాడు. జిమ్ములకు వచ్చే ప్రముఖులతో పరిచయం పెంచుకుని సిద్ధార్థ బౌన్సర్లను సరఫరా చేసేవాడు. 

బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు కిడ్నాప్ నకు పథక రచన చేసిన తర్వాత భార్గవ్ రామ్ సిద్ధార్థను సంప్రదించాడు బలిష్టంగా ఉన్న నలుగురు మనుషులు కావాలని సూచించాడు. వారిని కిడ్నాప్ నకు ముందు రోజు సిద్ధార్థ హైదరాబాదుకు పంపించాడు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాదు టాస్క్ పోర్స్ పోలీసులు విజయవాడకు వచ్చారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఉన్న వైసీపీ నాయకుడు దేవరకొండ వెంకటేశ్వర రావు కుమారులు సాయి, వంశీలను అరెస్టు చేసి తీసుకుని వచ్చారు. వారిద్దరు కిడ్నాపర్లుగా వ్యవహరిచిట్లు తెలుస్తోంది. 

వారిని విచారించనప్పుడు సిద్దార్థ పేరు ముందుకు వచ్ింది. వారు ఇచ్చిన సమాచారంతో సిద్ధార్థను అరెస్టు చేశారు.