నిజాయితీ చాటిన సిద్ధిపేట యువకులు

First Published 10, Jun 2018, 4:03 PM IST
siddipet youth doing good job
Highlights

అందరూ మెచ్చుకున్నారు

సిద్ధిపేటలోని 2వ వార్డ్ కి చెందిన కిర్మీ ప్రవీణ్ తన నిజాయితీని చాటుకుని అందరి మన్ననలు పొందాడు. రెండు రోజుల క్రితం ప్రవీణ్ కు  సాయంత్రం పూట నర్సపూర్ చౌరస్తా దగ్గర 100000(లక్ష) రూపాలు దొరికాయి.

అయితే ఆ డబ్బు ఏం చేయాలా అని తన స్నేహితుడైన ఉదర మణిదీప్ రెడ్డికి కాల్ చేశాడు. దీంతో వెంటనే ఆ ఇద్దరు యువకులు కలుసుకుని  ఆ డబ్బును సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి సిఐ ఆంజనేయులుకు అప్పగించారు.

దీంతో పోలీసులు వారిని అభినందించారు. వెంటనే ఆ డబ్బు ఎవరిదో అని పోలీసులు ఆరా తీసి వారి వివరాలు సేకరించి వారికి అందజేశారు. ప్రవీణ్, మణిదీప్ చేసిన పనికి సిద్దిపేట జనాలు కూడా అభినందించారు.

loader