Road Accident in Siddipet: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప‌ట్ట‌ణ శివారులోని రంగాధాంపల్లి  చౌరస్తా టర్నింగ్ వద్ద కారు ఆగి ఉన్న డీసీఎం వాహ‌నాన్ని  అతి వేగంతో ప్ర‌యాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక్క‌రు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించ‌గా.. మరో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.  

Road Accident in Siddipet: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని అతివేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక్క‌రూ అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించగా.. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వివరాల్లోకెళ్తే.. జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు సిద్దిపేట పట్టణంలోని రంగాధాపల్లి చౌరస్తా సమీపంలో ఆగి ఉన్న డిసిఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ఛాయా రాణి (62) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు .. వెంటేనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 

పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు డ్రైవింగ్ చేస్తున్న నర్సయ్య, సరితా రాణి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్ష‌త‌గ్రాతుల‌ను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుని మృతి చెందిన ఛాయా రాణి మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. ఈ ఘ‌టనపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

"