Siddipet: సిద్దిపేట సిగలో మరో మణిహారం.. 1000 పడకల ఆసుపత్రి ప్రారంభం నేడే..
Siddipet: సిద్దిపేట సిగలో మరో మణిహారం చేరనున్నది. నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించాలని లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్మించిన 1000 పడకల ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నేడు ప్రారంభించనున్నారు.

Siddipet: సిద్దిపేట సిగలో మరో మణిహారం చేరనున్నది. నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించాలని లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్దిపేట మెడికల్ కళాశాల అనుబంధంగా 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది. ఈ ఆసుపత్రిను మంత్రి హరీశ్ రావు నేడు (గురువారం) ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల తరహాలో ప్రత్యేక విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఉచితంగా మెరుగ్గా కార్పోరేట్ స్ధాయిలోని సూపర్ స్పెషాలిటీ తరహాలో వైద్య సేవలు అందించే లక్ష్యంగా సిద్దిపేట మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆస్పత్రిలో ప్రథమ చిక్సిత నుంచి ప్రాణాంతక వ్యాధులైన కిడ్నీ, కాన్సర్, గుండె సంబంధిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకరానున్నారు. ఈ ఆస్ప్రతిలో అన్ని రకాల వైద్య సేవలు అందించే స్పెషలిస్టు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మెడికల్ కళాశాల అనుబంధంగా ఉండటం సిద్దిపేట లోనే ప్రతి ఏటా 175 మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు.
అందుబాటులో ఉండే వైద్య సేవలు
- సర్జికల్ మరియు ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు
- జనరల్ మెడిసిన్
- పిడియాట్రిక్స్(పిల్లల విభాగం)
- ప్రసూతి మరియు గైనకాలజీ
- ఆర్థోపెడిక్ (ఎముకల చికిత్స మరియు రీప్లేస్‌మెంట్)
- ఆప్తమాలజీ (కంటి చికిత్స, సర్జరీలు)
- ఈఎన్‌టీ (చెవి,ముక్కు,గొంతు)
- సైకియాట్రీ (మానసిక వైద్యం)
- డెర్మటాలజీ (చర్మవ్యాధుల నివారణ)
- రెస్పిరేటరీ మెడిసిన్ (శ్వాసకోశ చికిత్స)
- అనస్తిషియా (పాముకాటు, క్రిమిసంహారక మందు బాధితులకు చికిత్స)
- డెంటల్( దంతాలకు అన్ని రకాల చికిత్స)
- రేడియాలజికల్ సేవలు( సిటి స్కాన్, అల్ర్టాసౌండ్, టిఫా, ఎక్స్‌రేలు, మామోగ్రఫీ టెస్టులు)
- ల్యాబ్ (బయోకెమిస్ర్టీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాలు)
- ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలు
- ఐసీయూ సేవలు
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు
- నవజాత శిశు రక్షణ విభాగం
- పాలియేటివ్ కేర్ సెంటర్
- క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కీమోథెరపీ సెంటర్
- ఫిజియోథెరపీ
- ఆరోగ్య మహిళా సేవలు
- యాంటీ రెట్రోవైరల్ థెరపీ
- డయాగ్నోస్టిక్ హబ్(134 రకాల రక్త పరీక్షలు)
వైద్య మంత్రి గా గొప్ప సంతృప్తినిస్తుంది : మంత్రి హరీష్
మనిషికి ఆరోగ్యం కంటే గొప్ప సంపద లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించుకోవడం చాలా సంతోషం గా ఉందని, ప్రజలకు ఆర్థిక స్థోమత లేక, సరైన వైద్య సేవలు లేక ప్రజలు హైదరాబాద్ లాంటి నగరాలు వెళ్లి వ్యయప్రయసలు గురైన సందర్భాలు ఎన్నో నా దృష్టికి వచ్చాయని అన్నారు. మన ప్రజలకు మన సిద్దిపేట లోనే అన్ని రకాల వైద్య సేవలు ఉచితం గా మెరుగ్గా అందించాలనే సంకల్పం తో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెడికల్ కళాశాల మంజూరు చేపించుకొని అన్ని రకాల చికిత్సలు అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులతో నేడు 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు కావడం ఒక వైద్య మంత్రి గా గొప్ప సంతృప్తినిచ్చిస్తుందని అన్నారు.