మరో మహిళతో అఫైర్: భార్య ఫిర్యాదుతో ఎస్సైపై కేసు

SI’s wife seeks husband’s arrest
Highlights

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు హైదరాబాదులోని మల్కాజిగిరి పోలీసులు ఎట్టకేలకు ఎస్సైపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు హైదరాబాదులోని మల్కాజిగిరి పోలీసులు ఎట్టకేలకు ఎస్సైపై కేసు నమోదు చేశారు. ఎస్సై లక్ష్మారెడ్డిపై భార్య జ్యోతి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 

సంగారెడ్డి పోలీసు స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న పెద్దుల లక్ష్మారెడ్డి 2013లో తనను వివాహంచ చేసుకున్నాడని, తమకు మూడున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని ఫిర్యాదు చేసిన మహిళ జ్యోతి లక్ష్మారెడ్డి చెప్పారు. 

లక్ష్మారెడ్డి 2014 నుంచి మరో మహిళతో అఫైర్ కొనసాగిస్తున్నాడని, దాంతో తమ మధ్య గొడవ జరుగుతూ వచ్చిందని ఆమె తన ఫిర్యాదులో తతెలిపింది. వేరే మహిళతో అఫైర్ గురించి తనకు తెలియడంతో తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని 2015లో తనకు చెప్పాడని, మరో మహిళను పెళ్లి చేసుకుంటే ఎక్కువ వరకట్నం వస్తుందని అన్నాడని ఆమె అన్నది. 

కొన్ని మాసాల క్రితం ఎస్సై భార్యను, చిన్నారిని బెదిరించాడని, తమకు ఫిర్యాదు అందిందని, గొడవల కారణంగా దంపతులిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, భార్య రాజీకి సిద్ధంగా ఉన్నప్పటికీ భార్య అంగీకరించడం లేదని మల్కాజిగిరి పోలీసులు అంటున్నారు.   

తాను 2017 జనవరిలో భర్త వద్దకు వెళ్లానని, అయితే, చంపేస్తానని అతను బెదిరించాడని, కత్తీ సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించాడని, అప్పటి నుంచి తాను మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నానని మహిళ చెప్పింది. అయితే, పోలీసులు తన ఫిర్యాదును తీసుకోలేదని చెబుతోంది. 

పోలీసుల  తీరుతో విసుగు చెందిన మహిళ 2018 ఫిబ్రవరిలో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. సంఘటనపై దర్యాప్తు చేయాలని కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

loader