Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ భయాలు: తెలంగాణలో ఒక్కరోజులో రూ.125 కోట్లు తాగేశారు

తెలంగాణలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మద్యం ప్రియులు మంగళవారమే భారీగా కొనుగోలు చేశారు.

Shocking Liquor Sales In Telangana In single day ksp
Author
hyderabad, First Published May 12, 2021, 4:52 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మద్యం ప్రియులు మంగళవారమే భారీగా కొనుగోలు చేశారు. మళ్లీ మందు దొరుకుతుందో లేదోనన్న అనుమానంతో లెక్కకు మించి కొనుగోలు చేశారు.

గంటల తరబడి వైన్స్ షాపుల ముందు నిలబడి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. నిన్న ఒక్కరోజే రూ.125 కోట్ల మద్యం విక్రయించగా, ఇవాళ రూ.94 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది.

Also Read:తెలంగాణలో లాక్‌డౌన్: పోటెత్తిన మందు బాబులు.. మద్యం షాపులు కిటకిట

ఈ నెల 1 నుంచి 12 వరకు రూ.770 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. దీంతో నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లకు మందు బాబులు క్యూకట్టారు.

మార్నింగ్ వాక్ ముగించుకుని నేరుగా మద్యం దుకాణాలకు పరుగులు తీశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వైన్ షాపులు తీసేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీంతో యజమానులు వైన్ షాపులను తెరిచి వుంచినా కస్టమర్లు అంతంత మాత్రంగానే వచ్చారు. చాలా ప్రాంతాల్లో నిన్నే మద్యం సరకు ఖాళీ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios