Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డికి షాక్ ఇయ్యబోతే టిఆర్ఎస్ నేతల ఇజ్జత్ పోయింది

తెలంగాణ హాట్ న్యూస్..

Shock to two TRS leaders

తెలంగాణ సర్కారుకు కొరుకుడురాని కొయ్యగా మారిపోయాడు నల్లగొండ కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన తెలంగాణ సర్కారుకు సిసలైన ప్రత్యర్థిగా తయారైతున్నాడు. మొన్నటికి మొన్న ఆయనమీద, ఆయనతోపాటు సంపత్ కుమార్ మీద అసెంబ్లీ లో సస్పెన్షన్ వేటు పడింది. కానీ కోర్టులో కొట్లాడి సర్కారుపై గెలిచిండు కోమటిరెడ్డి. తాజాగా మరోసారి కోమటిరెడ్డి టిఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చిండు. ఆ వివరాల కోసం కింద చదవండి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతలు సక్రమంగా లేవని ఇద్దరు టిఆర్ఎస్ లీడర్లు హైకోర్టులో కేసు వేశారు. మూడేళ్ల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హత విషయంలో నల్లగొండ టిఆర్ఎస్ లీడర్ దుబ్బాక నర్సింహ్మారెడ్డి, అప్పటి టిడిపి లీడర్ కంచర్ల భూపాల్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. విచారణ మూడేళ్లు జరిగింది. ఇంతలో అనేక పరిణామాలు జరిగిపోయాయి. టిడిపిలో ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు.

ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ ఇద్దరు నేతలు హైకోర్టులో వేసిన కేసులో తీర్పు వెలువడింది. కోమటిరెడ్డి విద్యార్హత విషయంలో కేసు వేసిన ఇద్దరు నేతలకు కోర్టు మొట్టికాయలు వేసింది. మూడేళ్లపాటు కోర్టువారి విలువైన సమయాన్ని దుర్వినియోగం చేశారని చివాట్లు పెట్టింది. అంతేకాదు ఇద్దరు నేతలకు చెరో 25వేల జరిమానా విధిస్తూ కేసును కొట్టేసింది. ఈ తీర్పు నల్లగొండ టిఆర్ఎస్ నేతలకు షాకింగ్ గానే ఉందని జిల్లా రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios