తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలకనేత ఒకరు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలకనేత ఒకరు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సార సాంబయ్యతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీని వీడారు. బుధవారం సాతయంత్రం వీరంతా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీలోని కొందరు నాయకులు ఒంటెద్దు పోకడలు పోతూ.. పార్టీని ఆబాసుపాలు చేస్తున్నారని.. ఈ విషయమై పలుమార్లు మాజీ ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరామన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చే రేందుకు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.