Asianet News TeluguAsianet News Telugu

దాసోజు శ్రవణ్ కి షాక్.. నామినేషన్ తిరస్కరణ

కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కి ఊహించని షాక్ ఎదురైంది. ఆయన నామినేషన్ ని రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

shock to dasoju sravan, nomination rejected
Author
Hyderabad, First Published Nov 15, 2018, 2:23 PM IST

కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కి ఊహించని షాక్ ఎదురైంది. ఆయన నామినేషన్ ని రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అసలు మ్యాటర్ లోకి వెళితే... మహాకూటమి తరపున కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దాసోజు శ్రవణ్‌కుమార్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆయన సహచరులు ఖైరతాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి వద్దకు వచ్చారు. 

అయితే అభ్యర్థి శ్రవణ్ లేకపోవడం, అతనిని బలపరిచే వ్యక్తులు కూడా ప్రత్యక్షంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ పత్రాలను స్వీకరించేందుకు రిటర్నింగ్‌ అధికారి ముషారఫ్‌ ఫారుఖీ నిరాకరించారు.
 
ఇతరుల తరపున నామినేషన్లను స్వీకరించాలంటే అభ్యర్థి కానీ, ఆయన ప్రతిపాదించిన ఓటరు కానీ తప్పకుండా ఉండాలని, దాసోజు విషయంలో ఇద్దరు లేకపోవడంవల్లే నామినేషన్‌ను తీసుకోలేదని తెలిపారు.
 
రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌ నుంచి 100 మీటర్ల పరిధి వరకు సెక్షన్‌ 144 అమలులో ఉందని, నామినేషన్‌ కోసం వచ్చే అభ్యర్థుల అనుచరులు, ఎవరైనా నినాదాలు చేయకూడదని తెలిపారు. అభ్యర్థితో పాటు కేవలం నలుగురికి మాత్రమే కార్యాలయ గేటు లోపలికి అనుమతిస్తామని, ఈ విషయమై పార్టీలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించరాదని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios