తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముప్పై ఏళ్ళుగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. శ్రీహరి తన అనుచరులతో కలిసి రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ద్వారా గులాబీ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

"కాంగ్రెస్‌ పార్టీకి ఎన్ని అవకాశాలు వచ్చినా అసమర్ధ నాయకుల వల్ల తీవ్రమైన నష్టం జరుగుతోంది. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకునే కార్యకర్తలను పట్టించుకునే వారేలేరు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడనేది ఆత్మీయులతో చర్చించి త్వరలోనే చెబుతాను" అని రాజనాల తెలిపారు.