తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో కీలకనేత రాజీనామా చేస్తున్నారు. బీజేపీ ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ సెల్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ గోపు రమణారెడ్డి పార్టీని వీడుతున్నట్లు స్వయంగా మీడియాకి తెలిపారు.

రానున్న ఎన్నికల్లో మల్కాజిగిరి టికెట్‌ ఆశించానని, టికెట్‌ రాకపోవడంతో వీలైతే రెబల్‌గా, లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, నోటీసు ఇచ్చి వివరణ అడగాల్సి ఉంటుందని, వివరణకు సంతృప్తి చెందకపోతే సస్పెండ్‌ చేసే అధికారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఉంటుందన్నారు. 

అలా కాకుండా ఏకపక్షంగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నియోకవర్గ నాయకులు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నాని చెప్పారు. తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుష్పచారం చేస్తున్నారని, అయినా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.