ఉదయాన్నే రామాలయానికి వెళ్తున్న పూజారి శ్రీనివాస శాస్త్రి ఆకాశంలో మబ్బులు shivalingam ఆకారంలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని వెంటనే తన ఫోన్లో బంధించారు. 

మహాలయ అమావాస్య సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం తెల్లవారుజామున సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండయ్య గూడెంలో ఆకాశంలో శివలింగం ప్రత్యక్షమయ్యింది. ఉదయాన్నే రామాలయానికి వెళ్తున్న పూజారి శ్రీనివాస శాస్త్రి ఆకాశంలో మబ్బులు shivalingam ఆకారంలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఈ అద్భుత దృశ్యాన్ని వెంటనే తన ఫోన్లో బంధించారు. శ్రీనివాస శాస్త్రి నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయంలో పూజారి గా వ్యవహరిస్తున్నారు. Mahalaya Amavasyaనాడు తనకు ఇలా ఆకాశంలో శివలింగం దర్శనమివ్వడం తన అదృష్టం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటో స్థానికంగా వైరల్ గా మారింది. అనేకమంది వాట్సాప్ గ్రూపులో ఈ ఫోటోలు షేర్ చేస్తున్నారు.