Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన రెండు మాసాలకే భర్త పరార్: భార్య ఏం చేసిందంటే?

ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త... తనను మోసం చేశాడని బాధితురాలు భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకొంది.

shilpa protest in front of husband's house at gundlabavi in yadadri district
Author
Choutuppal, First Published Sep 27, 2018, 11:45 AM IST

చౌటుప్పల్: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త... తనను మోసం చేశాడని బాధితురాలు భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకొంది.

చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామామనికి చెందిన శివాజీ అనే యువకుడిని ప్రేమించింది.  వీరిద్దరివి వేర్వేరు కులాలు. అయినా పెద్దలను ఎదిరించి ఇద్దరూ కూడ వివాహం చేసుకొన్నారు.  ఈ ఏడాది జూలై నాలుగో తేదీన ఆర్యసమాజ్‌లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొన్నారు. 

ఇద్దరూ కూడ మేజర్లు కావడంతో పోలీసులకు రెండు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరిద్దరూ హైద్రాబాద్ వనస్థలిపురంలో  కాపురం పెట్టారు. అయితే కొంతకాలం పాటు భార్య, భర్తలు బాగానే ఉన్నారు. ఈ నెల 20వ తేదీన  వనస్థలిపురం బస్టాప్ వద్ద  తనను   శివాజీ వదిలివెళ్లాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

పెళ్లి జరిగిన తర్వాత అత్త, ఆడపడుచుల మాటలను విన్న భర్త తనను వదిలించుకొనేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపిస్తోంది.భర్త కోసం గాలిస్తే ఆచూకీ లభ్యం కాకపోవడంతో దీంతో బాధితురాలు చౌటుప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 

పోలీసులు శివాజీ కుటుంబసభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో యువతిని తమ ఇంటికి తీసుకెళ్తామని  హమీ ఇచ్చినట్టు బాధితురాలు చెబుతోంది. కానీ, తమ కుమారుడిని  పిలిపించకపోవడంతో  బాధితురాలు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భర్త కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు.తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తానని బాధితురాలు  చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios