Asianet News TeluguAsianet News Telugu

మానేరు వాగులో గల్లంతైన గొర్రెల కాపరి: గాలింపు చేపట్టిన అధికారులు


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో 40 గొర్రెలు సహా గొర్రెల కాపరి గల్లంతయ్యాడు. గొర్రెల కాపరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఎగువ నుండి భారీగా వరద రావడంతో  సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

shepherd trapped in maneru vagu in Rajanna sircilla district
Author
Karimnagar, First Published Aug 31, 2021, 4:57 PM IST


సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగులో గల్లంతైన గొర్రెల కాపరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మానేరు వాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది.

40 గొర్రెలతో సహా గొర్రెల కాపరి మానేరు వాగులో గల్తంతయ్యారు. వాగులో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది. మానేరు వాగులో గంగమ్మ ఆలయం నీటిలో మునిగిపోయింది. ఎగువ నుండి వరద ప్రవాహం పెరిగింది.  రెస్క్యూ  చేపట్టే సిబ్బంది గంగమ్మ ఆలయం వరకే వెళ్తున్నారు. 

మానేరు వాగులో నిన్న చిక్కుకున్న ఆర్టీసీ బస్సు ను కూడ అధికారులు  బయటకు తీయలేదు. అయితే బస్సులోని 29 మంది ప్రయాణీకులు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికులు వాగు నుండి  ప్రయాణీకులను బయటకు తీసుకొచ్చారు. 

రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ని పలు  జిల్లాల  అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios