Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక మండలంలో జీవాల దొంగల హల్‌చల్.. వణికిపోతున్న గ్రామస్తులు

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఓ గ్రామంలో మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్నారు దొంగలు. వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు వాటి యజమానులు. తాజాగా వెంకటగిరి తండాలో గుర్తు తెలియని వ్యక్తులు మేకలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి

sheep goat theft in dubbak mandal
Author
Dubbaka, First Published Sep 10, 2021, 2:24 PM IST

సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, లేదా విలువైన సామాన్లను చోరీ చేస్తూ వుంటారు. అయితే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఓ గ్రామంలో మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్నారు దొంగలు. వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు వాటి యజమానులు. తాజాగా వెంకటగిరి తండాలో గుర్తు తెలియని వ్యక్తులు మేకలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిపై వాటి యజమాని దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా రాత్రి పూట పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కోరుకుంటున్నారు స్థానికులు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడంతో.. కొన్ని చోట్ల మాత్రమే చోరీ దృశ్యాలు రికార్డు అవుతున్నాయి. దీంతో పోలీసులు.. మేకలు, గొర్రెల దొంగలిస్తున్న దొంగల ఆట కట్టిస్తారా..? లేదా అనేదీ వేచి చూడాలి

Follow Us:
Download App:
  • android
  • ios