హైదరాబాద్ నగరంలో మహిళల సెఫ్టీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు షీటీం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమెన్ సేఫ్టీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆమె వివరించారు.

Also Read కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా సునీల్ రావు...

ఈ నెంబర్ కి కేవలం వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు, ఫోటోల వివరాలు మాత్రమే పంపించాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఐపీఎల్ అధికారిణి సుమతి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ పి. శ్రావణ్ కుమార్, కలాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపల్ నాగమణిలతో కలిసి ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ ని స్వాతి లక్రా ఆవిష్కరించారు.

ఉమెన్ సేఫ్టీ నెంబర్ 94416 69988 గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పబ్లిక్ సేఫ్టీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.