హైదరాబాద్: బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పోరేటర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే కూతురు విజయలక్ష్మి తనను దూషించారని షేక్‌పేట తహసీల్దార్  శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 హైకోర్టుకు వెళ్లకుండా టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయలక్ష్మి  బుధవారం నాడు తన కార్యాలయానికి వచ్చి హల్ చల్ చేశారని ఆయన ఆరోపించారు. తనను ఇష్టారీతిలో దూషించారని షేక్‌పేట ఎమ్మార్వో   పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలతో కలిసి తనను ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. 

కార్యకర్తలతో గుంపులుగా గుంపులుగా వచ్చి తనను అడ్డుకొన్నారని ఆయన  పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆమె అటంకం కల్గించాని ఆయన పేర్కొన్నారు. కేకే కూతురని చెబుతూ తనను దూషించారని  ఆయన పేర్కొన్నారు.కార్పోరేటర్ విజయలక్ష్మి సహా ఆమె అనుచరులు గుంపులుగా వచ్చి కార్యాలయంలో హంగామా చేశారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ సిబ్బంది కూడ పనులు చేసుకోకుండా ఇబ్బంది కలిగిందని ఆయన ఆరోపించారు. 

తనను ఇబ్బందులకు గురి చేసిన కార్పోరేటర్ విజయలక్ష్మిపై  చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో ఎమ్మార్వో పోలీసులను కోరారు.