హైదరాబాద్ శివారులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా కురిసిన పొగమంచు కారణంగా దూరం నుంచి వచ్చే వాహనాలు కనిపించక ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా వాహనాలు ద్వంసమయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్-కొత్తూరు మధ్య గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో తదట్టమైన పొగమంచు కారణంగా రహదారి కనరిపించకపోక పోవడం, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేవరకు కనిపించకపోవడంతో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 ఆర్టీసి బస్సులు, 2 ప్రైవేట్ బస్సులు, 2 లారీలు, ఆటోలు, కార్లు ఇలా దాదాపు 50 వాహనాలు ద్వంసమైయ్యాయి. 
 
ఇలా ప్రమాదానికి గురైన వాహానాలు రోడ్డుపైనే ఆగిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ జరిగింది. దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాపసిక్ స్తంబించిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం  ద్వంసమైన వాహనాలను పక్కకు తీయించి ట్రాపిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.