హైదరాబాద్: కాంగ్రెసు నేత షబ్బీర్ అలీకి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. తనకు వచ్చిన విద్యుచ్ఛక్తి బిల్లును చూసి ఆయన బిత్తరపోయే ఉంటారు. తనకు గతంలో నెలకు 45 రూపాయల బిల్లు వచ్చేదని, ఇప్పుడు లక్షా 5 వేల రూపాయల బిల్లు వచ్చిందని స్వయంగా చెప్పారు. కరెంట్ బిల్లులపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కాంగ్రెసు పార్టీ నేతలు నిరస పాటించారు. 

నిరసన కార్యక్రమంలో షబ్బీర్ అలీ తనకు వచ్చిన కరెంట్ బిల్లు గురించి చెప్పారు. లాక్ డౌన్ కాలంలోని మూడు నెలల బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వాన్ిి డిమాండ్ చేశారు. నల్ల కుండవా ధరించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. 

కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయం ముందు కాంగ్రెసు నేతలు సోమవారం ఉదయం దర్నాకు దిగారు. విద్యుత్తు బిల్లులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 

అధిక కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలియజేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలువు మేరకు నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. కరెంట్ బిల్లులతో ప్రజలు అల్ాడి పోతున్నారని పొన్నం అన్నారు. 

ఇబ్రహీం సబ్ సేటేషన్ వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నాకు దిగారు, రాష్ట్రంలో పాలన స్తంభించిందని ఆయన అన్నారు. కరోనా సమయంలో కరెంట్ చార్జీలు పెంచడం సరి కాదని ఆయన అన్నారు. 

ఖమ్మంలో కాంగ్రెసు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు.