Asianet News TeluguAsianet News Telugu

నోట్ల మార్పిడి స్కాం: చార్టెడ్ అకౌంటెంట్ నలిని ప్రభాత్ పంచాల్ అరెస్ట్

డీమానిటైజేషన్ సమయంలో నోట్ల మార్పిడి  స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  చార్టెడ్ అకౌంటెంట్  నలిని ప్రభాత్ ను ఎస్ఎఫ్ఐఓ అధికారులు  అరెస్ట్ చేశారు.

SFIO Arrests Chartered Accountant For Role During Demonetisation lns
Author
First Published Sep 20, 2023, 9:35 AM IST

హైదరాబాద్:  డీమానిటైజేషన్ సమయంలో నోట్ల మార్పిడి స్కాంలో ఆరోపణలు  ఎదుర్కొంటున్న  నలిని ప్రభాత్ ను  ఎస్ఎఫ్ఐఓఓ అధికారులు  బుధవారంనాడు అరెస్ట్ చేశారు.  2018లోనే  నలిని ప్రభాత్  పంచాల్ పై  ఎస్ఎఫ్ఐఓ అధికారులు కేసు నమోదు చేశారు. డీమానిటైజేషన్ సమయంలో రూ. 3 వేల కోట్లను డిపాజిట్ చేసినట్టుగా  నలిని ప్రభాత్ పై  ఆరోపణలున్నాయి. 18 కంపెనీల ద్వారా ఈ డబ్బులను  డిపాజిట్ చేశారని  ఎస్ఎఫ్ఐఓ ఆరోపిస్తుంది. 

2016 నవంబర్ లో  కేంద్ర ప్రభుత్వం  రూ. 500, రూ. 1000 నగదు నోట్లను రద్దు చేసింది. ఈ నగదు నోట్లను మార్పిడి చేసుకునేందుకు  అవకాశం కల్పించింది.అయితే  ఈ సమయంలో  నిబంధనలకు విరుద్దంగా  రూ. 500, రూ. 1000 నగదు నోట్లను మార్పిడి చేశారనే  ఆరోపణలు వచ్చాయి.  ఈ విషయమై  చార్టెడ్ అకౌంటెంట్  నలిని ప్రభాత్ పంచాల్ ను  అరెస్ట్ చేశారు ఎస్ఎఫ్ఐఓ అధికారులు.ఈ మేరకు  సోమవారంనాడు  ఎస్ఎఫ్ఐఓ అధికారులు  ప్రకటన విడుదల చేశారు.నలిని ప్రభాత్ పంచాల్ సహా, నిత్యాంక్ ఇన్‌ఫ్రాపవర్, మల్టీవెంచర్స్ వ్యవహరాలపై  విచారణ జరిపారు. హైద్రాబాద్ లోని ప్రత్యేక కోర్టులో  ప్రాసిక్యూషన్ ప్రారంభించినట్టుగా కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ  విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.ఈ విషయమై  సమన్లు జారీ చేసినప్పటికీ  హైద్రాబాద్ లోని ప్రత్యేక కోర్టుకు హాజరు కానందున పంచల్ ను అరెస్ట్ చేశారు ఎస్ఎఫ్ఓఐ అధికారులు.

హైద్రాబాద్ లోని ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన  నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ కు అనుగుణంగా పంచల్ ను అరెస్ట్ చేసినట్టుగా అధికారులు తెలిపారు.  హైద్రాబాద్ లోని  ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి జ్యుడిషీయల్ కస్టడీకి తరలించినట్టుగా  ఆ ప్రకటన తెలిపింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios