Asianet News TeluguAsianet News Telugu

కాజీపేట రైల్వేలో లైంగిక వేధింపుల పర్వం... మహిళా ఉద్యోగులపై కన్నేసిన కన్నింగ్ అధికారి

కాజీపేట రైల్వే స్టేషన్ లో మహిళా ఉద్యోగులపై ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  

sexual harassment on women employees in kazipet railway station
Author
Warangal, First Published Aug 18, 2021, 10:33 AM IST

వరంగల్: రైల్వే శాఖలో ఓ ఉన్నతాధికారి కీచకపర్వం బయటపడింది. కాజీపేట రైల్వేస్టేషన్ లో సిగ్నలింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారి తన కింది స్థాయిలో పనిచేసే మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటపడింది. అతడి వేధింపులను భరించలేక మహిళా ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రైల్వేశాఖలో లైంగిక వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... కాజీపేట రైల్వేస్టేషన్ లో ఓ అధికారి తన కిందిస్థాయి మహిళా ఉద్యోగులపై చాలాకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మహిళలతో అసభ్యంగా మాట్లాడటం, వాట్సాఫ్ లో అభ్యంతరకరంగా మెసేజ్ లు పంపించడం చేసేవాడు. ఎవరైనా మహిళా ఉద్యోగి ఇదేంటని ఎదురుతిరిగితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చార్జీ మొమోలు జారీ చేసేవాడు. దీంతో మహిళా ఉద్యోగులు అతడి కీచక చేష్టలను బరిస్తూ మౌనంగా ఉండిపోయారు. 

read more  వివాహేతర బంధాన్ని కలిగిన యువకున్నే... అతి కిరాతకంగా హతమార్చిన వివాహిత

అయితే ఇటీవల అతడి వేధింపులు మరీ మితిమీరుతుండటంతో మహిళా ఉద్యోగులు భరించలేకపోయారు. దీంతో సదరు అధికారి వేధింపులపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిందిస్థాయి ఉద్యోగులమైన తమపై సదరు అధికారి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios