హైదరాబాద్: హైద్రాబాద్ సంజీవరెడ్డినగర్‌లో క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

హైద్రాబాద్ సంజీవరెడ్డి నగర్‌లో  క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఈ క్రేన్ ట్రక్కు కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.క్రేన్ ట్రక్కు నుండి తప్పించుకొనేందుకు చాలా మంది తమ వాహనాలను రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. 

బ్రేకు ఫెయిల్ కావడం వల్లే  ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.  క్రేన్ ట్రక్కు రోడ్డుపై ఇష్టారీతిలో నడవడంతో మహిళలు, పిల్లలు భయంతో  పరుగులు తీశారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.