ప్రభుత్వ స్కూల్స్ స్థలాల్లో ఆర్బీకేల నిర్మాణం: ఏపీ హైకోర్టుకు ఏడుగురు ఐఎఎస్‌లు
ప్రభుత్వ స్కూల్స్ స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించడంపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.ఈ విచారణ సందర్భంగా ఏడుగురు ఐఎఎస్ అధికారులు హాజరయ్యారు.
అమరావతి:ఏపీ హైకోర్టు ఎదుట ఏడుగురు ఐఎఎస్ అధికారులు మంగళవారం నాడు హాజరయ్యారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు నిర్మించడంపై హైకోర్టు ఇవాళ విచారించింది., ఈ విచారణ సందర్భంగా ఏడుగురు ఐఎఎస్ లు హైకోర్టుకు హాజరయ్యారు.
రాష్ట్రంలోని 1160 చోట్ల రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు నిర్మించినట్టుగా ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో నిర్మించిన నిర్మాణాలను మరో చోటుకి మార్చినట్టుగా ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
మరో 4 వారాల్లో మిగిలిన నిర్మాణాలను కూడ తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ హైకోర్టు ముందు ఐఎఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బి. రాజశేఖర్, , వి.చినవీరభద్రుడు, శ్యామలరావు, విజయ్ కుమార్, ఎం.ఎం. నాయక్ ఇవాళ విచారణకు హాజరయ్యారు.