సెర్ప్ ఉద్యోగుల నిరాహార దీక్ష మంత్రి జూపల్లి ఇచ్చిన హామీ నిలుపుకోలేక పోయాడన్న ఉద్యోగోలు సెర్ప్ కార్యాలయానికి భారీగా చేరుకున్న ఉద్యోగులు

నెల రోజుల్లో తమ సమస్యలను పరిష్కరిస్తామన్న గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాటతప్పారని అందువల్లే నిరాహార దీక్షకు దిగినట్లు సెర్ప్ ఉద్యోగులు తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లో పనిచేస్తున్న తాము ఇంతకు ముందు సీఎం క్యాంపు ఆఫిసులో ముఖ్యమంత్రి కి వినతి పత్రం సమర్పించడానికి వెళ్లగా తమను అరెస్ట్ చేసారు. అనంతరం మంత్రి జూపల్లి ఈ దర్నాపై స్పందించి తమను సంయమనంతో ఉండాలని నెల రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. మంత్రి హామీ ఇవ్వడంతో అప్పుడు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసాం. అయితే మంత్రి హామీ ఇచ్చి నెల రోజులకు పైనే అయిపోయినా ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు.అందుకోసమే ఈ నిరాహార దీక్షకు దిగినట్లు సెర్ప్ ఉద్యోగోలు తెలిపారు.

ఇవాళ మండల మరియు జిల్లా స్థాయి(అకౌంటేంట్, కంప్యూటర్ ఆపరేటర్స్&అటేండర్) ఉద్యోగులు భారి సంఖ్యలో సెర్ప్ ప్రధాన కార్యలయం లో ఆమరణ నిరాహాదిక్ష కు దిగారు. గత 17 సం,,లుగా మహిళా సంఘాలకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ అధికారులను, నాయకులను పలుమార్లు కలిసినా ఎలాంటి పలితం ఉండటంలేదని అన్నారు. 
 ప్రస్తుతం సెర్ప్ ఉద్యోగులు కూడ రెండు వారాల నుండి సమ్మె చేస్తున్నారు. వీరి క్రింది స్థాయి లో పని చేస్తున్న అకౌంటేంట్,కంప్యూటర్ ఆపరేటర్&అంటేండర్ ఉద్యోగులు ఈ రోజు ధీక్ష కు దిగడం తో సెర్ప్ సంస్థ లోని కార్యక్రమాలన్ని నిలిచిపోయాయి.