Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 17: కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కౌంటర్

September 17: ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న రాజ‌కీయ పోటీకి సెప్టెంబ‌ర్ 17 కీల‌క అంశంగా మారింది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేరువేరు పేర్ల‌తో భారీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. 
 

September 17: Telangana CM KCR counter to central government
Author
First Published Sep 13, 2022, 8:35 PM IST

CM KCR counter to central government: తెలంగాణ చ‌రిత్రలో సెప్టెంబ‌ర్ 17కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. దీనిని ఒక్క‌క్క‌రు ఒక్కో పేరుతో.. ఒక్కో అంశాన్ని పేర్కొంటూ గుర్తుచేసుకుంటారు. ఇప్పుడే ఇదే అంశాన్ని రాజ‌కీయ పార్టీలు హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ విష‌యంలో ఎవ‌రికి వారు పై చేయి సాధించే విధంగా ముందుకు క‌దులుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న రాజ‌కీయ పోటీకి సెప్టెంబ‌ర్ 17 ప్ర‌స్తుతం కీల‌క అంశంగా మారింది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేరువేరు పేర్ల‌తో భారీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.సెప్టెంబర్ 17న కేంద్ర ప్ర‌భుత్వం (బీజేపీ) తెలంగాణ విమోచనదినంగా పెద్దఎత్తున  జ‌ర‌ప‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున రాష్ట్ర ప్ర‌భుత్వం (టీఆర్ఎస్) తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్ల‌ను చేస్తోంది. ఈ విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర అధికార నాయ‌కులు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. 

ఇప్పుడు సెప్టెంబ‌ర్ 17 పోటీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డాని సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వానికి (బీజేపీ)..  ముఖ్య‌మంత్రి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 17 కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా దూసుకుపోవాల‌నుకున్న బీజేపీకి షాకిస్తూ.. అన్ని ఏర్పాట్లు చేసుకుపోతోంది టీఆర్ఎస్. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సెప్టెంబ‌ర్ 17 కార్య‌క్ర‌మానికి భారీ ప్ర‌చారం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. దీని కోసం తెలంగాణ‌లో భారీ ఎత్తున యాడ్స్ ఇవ్వాల‌కున్నాయి. దీని కోసం హైదరాబాద్‌‌లోని మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రచారం చేయాల‌ని ప్రణాళిక‌లు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయా యాడ్ ఏజెన్సీల‌తో ఒప్పందం చేసుకోవాల‌నుకున్నాయి. అయితే, టీఆర్ఎస్ ఆయా సంస్థ‌ల‌తో ముందుగానే ఒప్పందం చేసుకుని బీజేపీకి గ‌ట్టి షాక్ ఇచ్చింది. 

టీఆర్ఎస్ ముంద‌స్తు ఒప్పందం చేసుకోవ‌డంతో బీజేపీ ప్ర‌చారానికి ప్ర‌క‌ట‌న సంస్థ‌లు నో చెప్పాయి. టీఆర్ఎస్ తో చేసుకున్న ఒప్పందంతో బీజేపీ విన్న‌పాల‌కు నో అన్నాయి. దీంతో బీజేపీ ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప‌డి.. అధికార పార్టీపై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తోంది. దీని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ.. టీఆర్ఎస్ పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్.. కావాల‌నే సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ స‌మైక్య‌త దినోత్సం జ‌రుపుకోవాల‌ని ఎంఐఎం నాయ‌కుల‌తో లెట‌ర్ రాయించార‌ని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఆర్టీసీ బస్సులు అడిగితే త‌మ‌కు ఇవ్వ‌మ‌న్నార‌నీ, బ‌స్సు చార్జీలు సైతం పెంచార‌ని అన్నారు. 

అలాగే, కేసీఆర్, టీఆర్ఎస్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నీ, ఆయ‌న కుటుంబ పాల‌న‌పై కూడా ప్ర‌జ‌లు విసుగుచెందార‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. మోడీ పాల‌న‌లో పైర‌వీలు లేకుండా పోయాయ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. కేంద్రం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు సీఎం కేసీఆర్ ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక ఓటమి గురించి పేర్కొన్న కిష‌న్ రెడ్డి.. స‌రైన అభ్య‌ర్థి లేని కార‌ణంగానే ఓడిపోయామ‌ని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జార్ఖండ్, బీహార్, రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుంద‌ని తెలిపిన ఆయ‌న‌.. తెలంగాణ‌లో బీజేపీ స‌ర్కారు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఓడిపోవ‌డం ప‌క్కా అని అన్నారు. టీఆర్ఎస్-బీజేపీల మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితుల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 17న రెండు పార్టీల కార్య‌క్ర‌మాలు ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తాయోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios