పెంపుడు జంతువులపై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తారు. పెద్దంపల్లిలోని ఓ కుక్క యజమాని ఏకంగా దానికి సీమంతం చేసి తన ప్రేమను నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెడితే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం పెద్దంపల్లిలో ఓ వ్యక్తి పెంచుకున్న కుక్కకు గర్భం వచ్చింది. దీంతో విచిత్రమైన హడావుడి చేశాడు. కుక్కకు కన్నకూతురికి చేసినట్టు సీమంతం చేశాడు.

ఆడ, మగ కుక్కలకు కొత్త డ్రస్సులు, పూల దండలు వేసి, ఒళ్లో కూచోబెట్టుకుని సీమంతం తంతు పూర్తిచేశారు. డబ్బు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. సీమంతానికి వచ్చినవారు ఈ కుక్కలకు కట్నాలు కూడా చదివించారు.

ఈ వింత చూడడానికి ఊరు ఊరంతా కదిలిరావడంతో సందడి నెలకొంది. వీటితో ఫొటోలు దిగి సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.