ఈ సైబరాబాద్ పోలీస్ బాస్ ఏం చేసిండంటే ?(వీడియో)

First Published 19, Jan 2018, 1:14 PM IST
see how cyberabad police boss won the hearts of constables
Highlights
  • కానిస్టేబుళ్లకు పద్ధతులు నేర్పిన పోలీసు బాస్
  • బైక్ మీద హెల్మెట్ పెట్టుకోని పోవాలని సలహా
  • ముగ్గురు బైక్ మీద పోవద్దని ఒకరిని తనతో కారుతో తీసుకుపోయిన బాస్

పోలీసు అనగానే మనకు గుర్తొచ్చేది కాకీల కర్కశత్వం. వారు కరుకుగా ఉంటారన్న ముచ్చటే మనకు ఠక్కున మతికి వస్తది. కానీ.. వారిలోనూ చెత్తవాళ్లు, మంచివాళ్లూ ఉంటారు. ఇక పోలీసు బాసులంటే డాబు దర్పం చూపుతారు. కానీ ఈ పోలీసు బాస్ అట్లాంటి మనిషి కాదు. ఆయనేం చేశారో తెలియాంటే ఈ కింద వీడియో చూడాలి. వార్త చదవాలి. రండి చదవుదాం.

నేర చరిత్ర కలిగిన వారి ఇంటి దగ్గరకు సమగ్ర సర్వే లో భాగం గా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శౌoడిల్య అటెండ్ అయ్యారు. తర్వాత వెళ్లి పోయే టైమ్ లో కానిస్టేబుల్ వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తాను వెళ్తూ... మరి మీరెలా పోతారు అని ప్రశ్నించారరు ఆ పెద్ద సారు. దానికి వారు బైక్ మీద పోతామని జవాబు ఇచ్చిర్రు. దాంతో మస్ట్ గా హెల్మెట్ పెట్టుకోండి. అని వెళ్లిపోదామని కారు ఎక్కుతూ... అయినా ఒకే బండి మీద ముగ్గురు ఎట్లా పోతారు(ఏకీ గాడి మే తీనో కైసే జాతే)? అని మళ్లా అడిగిండు. దానికి ఒక  కానిస్టేబుల్ నేను ఆటో లో వెళ్తాను సార్ అనడం తో.. సిపి స్పందించారు.

నై.. చలో... కార్ మే... మేరే సాత్ అని కానిస్టేబుల్ ను ఎక్కించుకుని ,పక్కన కూర్చోబెట్టుకుని , మాట్లాడుకుంటూ వెళ్లారు. ఇలాంటి పోలీసు బాస్ లు ఎంతమంది ఉంటారబ్బా అని పోలీసు శాఖలో కిందిస్థాయి కానిస్టేబుల్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అస్తమానం ఆర్డర్లీ పేరుతో కానిస్టేబుళ్లతో చాకిరీ చేయించుకోవడం.. వాళ్లతో బాడీ మసాజ్ లు చేయించుకునే ముదునష్టపు బాస్ లు ఇకనైనా ఈ సార్ ను చూసి మారండి.. పోలీసు వ్యవస్థకు మంచిపేరు తేండ్రి ప్లీజ్.. అని కింది స్థాయి పోలీసులు అంటున్నారు.

 

loader