వూరు వెళ్తున్నట్లుగా లీవ్, నైటీ ధరించి చోరీ .. పక్కాగా స్కెచ్ : అయినా దొరికిపోయిన సెక్యూరిటీ గార్డ్

ఓ సెక్యూరిటీ గార్డ్ ఎంతో పక్కాగా స్కెచ్ గీసి లేడీస్ నైటీ వేసుకుని మరి సెల్‌ఫోన్‌ షోరూమ్‌లో దొంగతనం చేయగా.. పోలీసులు అతనిని పట్టుకుని సొత్తును రాబట్టారు. 

security guard wears Nighty to theft Cell phones in hyderabad ksp

రోజురోజుకు దొంగలు తెలివిమీరుతున్నారు. దొంగతనం చేసేందుకు కొత్త పద్ధతుల్లో చోరీలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన సోదరి నైటీలో వెళ్లి ఏకంగా 37 సెల్‌ఫోన్‌లు దొంగతనం చేశాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లెకు చెందిన మంకాల యాకయ్య అలియాస్ వినయ్ తండ్రి మరణంతో కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అనంతరం తల్లి , సోదరితో కలిసి తాడ్‌బండ్‌లో నివసిస్తున్నాడు. బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌లోని ఎమరాల్డ్ హౌస్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోదరి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది.

ఇదిలావుండగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యాకయ్య బుద్ది వక్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా గతంలో తాను పనిచేసిన సెల్‌ఫోన్ షాపులో చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. అది ఎమరాల్డ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్‌లోనే వుంటుంది. అందులోకి చొరబడి సెల్‌ఫోన్లు కొట్టేయాలని యాకయ్య పక్కా స్కెచ్ గీశాడు. ఇందుకోసం తాను సొంతూరికి వెళ్తున్నట్లు ముందుగానే సెలవు తీసుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా మే 28వ తేదీ రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తన సోదరి నైటీని ధరించి, మొబైల్ షోరూమ్ వెనుకవైపు వున్న షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం 27 రియల్ మీ మొబైల్ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను దొంగిలించి తన సొంతూరికి వెళ్లిపోయాడు. 

మరుసటి రోజు షోరూమ్‌లో దొంగతనం జరిగిందని భావించిన స్టోర్ ఇన్‌ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించే పని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఓ మహిళ లోపలికి ప్రవేశించినట్లుగా తేల్చారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డులను విచారించగా.. యాకయ్యపై అనుమానం వచ్చింది. ఈ సందర్భంగా అతనే దొంగతనానికి పాల్పడినట్లుగా నిర్ధారించిన పోలీసులు మంగళవారం మహబూబాబాద్ జిల్లా మడిపల్లెలో యాకయ్యను అరెస్ట్ చేసి .. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios