బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి భద్రతను పెంచారు పోలీసులు. ఇటీవల పట్టుబడ్డ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో రాజాసింగ్ పేరు ఉండడంతో ఆయనకు భద్రత పెంచుతున్నట్టు సిటీ కమీషనర్ అంజనీ కుమార్ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో బైక్ పైన తిరగొద్దంటూ హైదరాబాద్ కమిషనర్ ఆయనను లేఖలో కోరారు. బైక్ పైన తిరగడం ఆయన ప్రాణాలకు ప్రమాదమని, అలా తిరగవద్దని కోరారు. ప్రభుత్వం కేటాయించిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మాత్రమే ఉపయోగించాలని రాజాసింగ్ ను అంజనీ కుమార్ అభ్యర్థించారు. 

రాజాసింగ్ రక్షణ కోసం ఆయన గన్ మెన్ లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, రాజసింగ్ గన్ మెన్ ల కు కొత్త వెపన్స్ కూడా ఇచ్చామని ఆ లేఖలో అంజనీ కుమార్ తెలిపారు. 

అడిషనల్ డీసీపీ నిన్న రాజాసింగ్ ఇంటివద్దకు వెళ్లి ,.. ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారని ఆరా తీశారు.అక్కడ చుట్టుపక్క వాకబు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఆయన భద్రతకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు.   ఇంటి వద్ద ప్రత్యేక భద్రతా చర్యలను చేపట్టారు. 

 
 

నా గన్ మ్యాన్ ని మార్చారు: రాజా సింగ్ 

ఇదిలా ఉంచితే.... కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంమంత్రి కి  రాజాసింగ్ లేఖ రాయనున్నట్టు తెలియవస్తుంది. తనకున్న భద్రతా ఇబ్బందుల ఎవరి నుంచి, ఎక్కడ నుంచో వివరాలు అందులో కోరనున్నట్టు తెలుస్తుంది. 

ఇకపోతే.... తనకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ... గన్ లైసెన్సు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తన గన్ మ్యాన్ ని కూడా మార్చారని, లైసెన్స్ కోసం అప్లై చేసుకొని రెండు సంవత్సరాలు అయినా కూడా ఎందుకు ఫైల్ తొక్కి పెడుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.