దైవ దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడిపై అక్కడి పూజరి దాడికి దిగారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
దైవ దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడిపై అక్కడి పూజరి దాడికి దిగారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. దీంతో భక్తులపై పూజారులు దాడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. ఉప్పల్ బాలాజీహిల్స్‌కు చెందిన వాల్మీకిరావు.. సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్‌కు వచ్చాడు. సికింద్రాబాద్ రైతిపైల్ బస్టాండ్ కి అనుకుని ఉన్న గణేష్ టెంపుల్ కి వెళ్లి ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్నాడు.
అనంతరం పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో అక్కడి వచ్చిన ప్రభాకర్ శర్మ.. అనుమతి లేకుండా గుడిలోనికి ఎలా వెళ్తావని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే భక్తుడిపై నోరుజారాడు. దీతో ప్రభాకర్ శర్మకు, వాల్మీకిరావుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో.. ఆగ్రహానికి లోనైన ప్రభాకర్ శర్మ.. వాల్మీకిరావుపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతేకాకుండా నువ్వు ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు. ప్రభాకర్ శర్మ.. వాల్మీకి రావుపై దాడి చేయడమే కాకుండా అతడినిని బెదిరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
ఈ ఘటనపై వాల్మీకిరావు గోపాలపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పూజారి ప్రభాకర్ శర్మ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దైవ దర్శనానికి వెళ్లిన తనపై ఈ రకంగా దాడి చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తనపై దాడికి పాల్పడిన పూజారిపై చర్యలు తీసుకోవానలి ఆలయ అధికారులనుకోరారు.
