ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకై సాయన్న అనుచరుల ఆందోళన: జోక్యం చేసుకున్న కుటుంబ సభ్యులు

సికింద్రాబాద్ కంటోన్మెంట్  ఎమ్మెల్యే  సాయన్న  అంత్యక్రియలు  అధికారిక లాంచనాలతో  నిర్వహించాలని  ఆయన అనుచరులు డిమాండ్  చేస్తున్నారు.అధికారిక లాంఛనాలతో  అంత్యక్రియల కోసం  స్మశానవాటికలోనే  బైఠాయించి  ఆందోళనకు దిగారు.  
 

secunderabad cantonment mla sayanna followers  demads  state funeral

హైదరాబాద్: సికింద్రాబాద్  కంటోన్మెంట్  ఎమ్మెల్యే  జి. సాయన్న అంత్యక్రియలు  అధికారిక లాంఛనాలతో  నిర్వహించాలని అనుచరులు  ఆందోళనకు దిగారు. అంత్యక్రియలు జరగకుండా స్మశానవాటికలోనే  సాయన్న అనుచరులు కొద్దిసేపు అడ్డుకున్నారు. కుటుంబసభ్యుల వినతి  మేరకు  నిరసనకారులు  దిగొచ్చారు. అనంతరం సాయన్న అంత్యక్రియలు నిర్వహించారు.  

అనారోగ్య కారణాలతో  సికింద్రాబాద్ కంటోన్మెంట్  ఎమ్మెల్యే  సాయన్న నిన్న  కన్నుమూశారు.  సోమవారం నాడు  మారేడ్ పల్లి  స్మశానవాటికలో  అంత్యక్రియలు  నిర్వహించాల్సి ఉంది. సాయంత్రం  మారేడ్ పల్లి  స్మశానవాటికకు  సాయన్న  మృతదేహం తీసుకు వచ్చిన తర్వాత  ఆయన  అనుచరులు ఆందోళనకు దిగారు. అధికారిక లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్  చేశారు. 

అధికారిక  లాంఛనాలతో  అంత్యక్రియల నిర్వహించాలని  అందోళనకు దిగారు. అంత్యక్రియలు  జరగకుండా నిరసనకు దిగారు. సాయన్న  అనుచరులకు  మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్,  మల్లారెడ్డిలు  నచ్చజెప్పే ప్రయత్నం  చేశారు. అయినా కూడా వారు వినలేదు.  

అధికారిక  లాంఛనాలతో  అంత్యక్రియలు  నిర్వహించాలని  పట్టుబట్టారు. దీంతో  చేసేదిలేక   మంత్రులు తలసాని  శ్రీనివాస్ యాదవ్,  మల్లారెడ్డిలు స్మశానవాటిక నుండి   వెళ్లిపోయారు . డిప్యూటీ స్పీకర్  పద్మారావు గౌడ్  సాయన్న  అనుచరులకు  నచ్చ.జెప్పే  ప్రయత్నం  చేశార. అయినా కూడా వారు వినలేదు..  అధికార లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహిస్తామని  హమీ ఇస్తేనే నిరసనను విరమిస్తామని   సాయన్న  అనుచరులు  తేల్చి చెప్పారు.

దీంతో  పోలీసులు  సాయన్న  కుటుంబసభ్యులతో  మాట్లాడారు.  పరిస్థితి  చేజారిపోకుండా  చూడాలని  కోరారు.  సాయన్న కుటుంబసభ్యులు  సాయన్న అనుచరులతో  చర్చించారు.  అంత్యక్రియలు  నిర్వహించేందుకు సహకరించాలని  కోరారు.  సాయన్న కుటుంబసభ్యుల వినతి మేరకు  నిరసనకారులు ఆందోళనను విరమించారు. దరిమిలా అంత్యక్రియలకు ఆటంకం తొలగిపోయింది.  

also read:జీ సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

ఇప్పటికిప్పుడు అధికారిక  లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహించాలంటే సమయం పడుతుందని పోలీసులు  సాయన్న  అనుచరులకు చెప్పారు.  ఈ విషయమై  సహకరించాలని  కోరారు.   ఇదే  విషయమై  కుటుంబసభ్యులకు పోలీసుల పరిస్థితిని  వివరించారు.   సాయన్న  అనుచరులకు  కుటుంబసభ్యులు  నచ్చజెప్పారు. దీంతో  అంత్యక్రియలు  నిర్వహణకు  అనుచరులు  ఒప్పుకున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios