Asianet News TeluguAsianet News Telugu

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 144 సెక్షన్ విధింపు.. పెరుగుతున్న ఆందోళ‌న

Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతభాగం శనివారం (అక్టోబ‌ర్ 21) రాత్రి కుంగిపోయింది. 20వ పిల్లర్ కుంగిపోవ‌డంతో బ్యారేజీ గేటు విరిగిపోయింది. లక్ష్మీ బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 57 గేట్లను ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 12,240 క్యూసెక్కులుగా ఉంది. ఇప్ప‌టికే నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయ‌గా, మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 144 సెక్షన్ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 
 

Section 144 imposed near Medigadda Barrage, Kaleswaram project,Jayashankar Bhupalapalli RMA
Author
First Published Oct 24, 2023, 9:40 AM IST

Section 144 imposed near Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతభాగం శనివారం (అక్టోబ‌ర్ 21) రాత్రి కుంగిపోయింది. 20వ పిల్లర్ కుంగిపోవ‌డంతో బ్యారేజీ గేటు విరిగిపోయింది. లక్ష్మీ బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 57 గేట్లను ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 12,240 క్యూసెక్కులుగా ఉంది. ఇప్ప‌టికే నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయ‌గా, మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 144 సెక్షన్ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే..  తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద శనివారం కొన్ని పిల్ల‌ర్లు మునిగిపోవడంతో సమీపంలో 144 సెక్షన్ విధించారు. కేంద్ర జల సంఘం సభ్యులు అక్టోబర్ 24న బ్యారేజీని సందర్శించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. 20వ పిల్లర్‌ మునిగిపోవడంతో బ్యారేజీ గేటు విరిగిపోయింది. లక్ష్మీ బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతోంది, అధికారులు 57 గేట్లను ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 12,240 క్యూసెక్కులుగా ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పునరుద్ధరణ బాధ్యత ప్రస్తుతం బ్యారేజీ ఆధీనంలో ఉన్న ఎల్ అండ్ టీ సంస్థదేనని స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ 6వ బ్లాక్‌ కింద 20వ పిల్లర్‌ అడుగుల వరకు కూలిపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం సాయంత్రం బ్యారేజీ సమీపంలో పెద్ద శబ్ధం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై విచారణ చేపట్టామన్నారు. బ్యారేజీలో నీరు ఉన్నందున ఇప్పుడేమీ చెప్పలేమనీ, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నీరు తగ్గిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు 20వ స్తంభం సమీపంలోని గేట్లను మూసివేసి ఇతర గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో ఎన్ని టీఎంసీల నీరు ఇచ్చారనీ, ప్రజల సంపదను దోచుకునేందుకే ఈ ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్) ప్రారంభ స్థానం, దీనిని ఎల్ అండ్ టి నిర్మించింది. దీనిని జూన్ 2019 లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించారు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా జరిగినా, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, ఎల్‌అండ్‌టీ అధికార ప్రతినిధి కానీ ఆదివారం సాయంత్రం వరకు స్పందించలేదని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios