ఖమ్మం పట్టణంలో పోలీసులు 144 సెక్షన్  విధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని....మరికొన్ని రోజుల పాటు ఇది కొనసాగనుందని కమీషనర్ తెలిపారు.

పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు కమీషనర్ పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ సాయంత్రం 6గంటల వరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 అమలులో ఉంటుందని ఆయన ప్రకటించారు.అయిుతే ప్రజలెవ్వరు ఆందోళన చెందవద్దని....ఇవి కేవలం శాంతిభద్రతల కోసమే తీసుకున్న చర్యలని తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.

పట్టణంలో విధించిన ఆంక్షల కారణంగా రాజకీయ పార్టీల ర్యాలీలతో మిగతా ఏ రకమైన ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి  లేదన్నారు. ఎక్కువ మంది కలిసి గుంపులుగా తిరగడం, నిరసనలు చేపట్టడంపై నిషేదం వుందన్నారు. దీంతో పట్టణ ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు సహకరించాలని కమీషనర్ సూచించారు.