నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల స్ట్రూటినీ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తున్నాయి. అదే సమయంలో భారీ మొత్తంలో నామినేషన్లు దాఖాలు చేశారు.
మునుగోడు ఉప పోరు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరుపై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నారు. అధికార ప్రతిపకాలు ఒక్కరిపై ఒక్కరూ విమర్శాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం మధ్యాహ్నమే ముగిసింది.
ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు, వ్యక్తులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలించి.. ఉప ఎన్నిక నామినేషన్ల స్ట్రూటినీ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఇంకా చాలామంది నామినేషన్లు చేశారు.వీటన్నిటినీ పరిశీలించిన ఎన్నికల అధికారులు నామినేషన్స్ కోసం అందించిన ధ్రువీకరణ పత్రాల్లో సరైన ఆధారాలు, వివరాలు చూపని అభ్యర్థుల వివరాలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు.
మునుగోడు ఉప పోరులో మొత్తం 130 మంది అభ్యర్థులు 199 సెట్లను దాఖలు చేశారు. అయితే.. ధ్రువీకరణ పత్రాల్లో సరైన ఆధారాలు, వివరాలు చూపని 47 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. అంటే.. 83 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదించారు. ఇక.. సోమవారం సాయంత్రం 3 గంటలకు వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశముంది . ఆ తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల వివరాలు తెలియనున్నాయి.
ఇదిలా ఉంటే.. తిరస్కరణకు గురైన నామినేషన్లలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి కేఏ పాల్ నామినేషన్ కూడా ఉంది. అయినా తానుఎన్నికల బరిలో ఉన్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కేఏ పాల్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా దాఖలు చేయగా... మరో నామినేషన్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేశారు.
అయితే.. ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ కారణంతోనే కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.కానీ,ఇండిపెండెంట్ హోదాలో దాఖలు చేసిన నామినేషన్‌ను మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు.
