హైదరాబాద్ బోరబండలో శుక్రవారం సాయంత్రం వచ్చిన భూకంపంపై శాస్త్రవేత్తలు స్పందించారు. బోరబండలో వచ్చింది స్వల్ప భూకంపమేనన్నారు సైంటిస్ట్ నగేశ్. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 1.5గా నమోదైందని ఆయన చెప్పారు.

భూకంపం 2 కిలోమీటర్ల లోపలే వచ్చింది కాబట్టే భారీ శబ్ధాలు వచ్చాయని నగేశ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతను బట్టి ప్రమాదం ఉంటుందన్నారు. 2017లో బోరబండ, దుర్గంచెరువులో భూకంపం వచ్చిందని నగేశ్ గుర్తుచేశారు.

బోరబండ డివిజన్‌ పరిధి లోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్‌–3లో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. సైట్‌–3 వీకర్‌సెక్షన్‌లోని సాయిరామ్‌నగర్, ఆదిత్యానగర్‌లలో భూకంపం వచ్చింది.

అక్కడి నుంచి పెద్దమ్మనగర్, జయవంత్‌నగర్, భవానీనగర్, అన్నా నగర్, రహమత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌హిల్స్‌ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా ప్రాణభయంతో హడలిపోయారు. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.