Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న కేసులు: రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల బంద్.. అసెంబ్లీలో సబిత ప్రకటన

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పాఠశాలలు, కళాశాలల్లో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆమె కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు

schools and colleges to be shut in telangana due to covid 19 says minister sabitha indra reddy ksp
Author
hyderabad, First Published Mar 23, 2021, 5:09 PM IST

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పాఠశాలలు, కళాశాలల్లో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆమె కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

అనంతరం అసెంబ్లీలో సబిత మాట్లాడుతూ... పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన అనంతరం విద్యార్ధులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను .. ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ వ్యాప్తంగా వున్న విద్యాసంస్ధల్ని రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 

వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ ఈ మూసివేత ఆదేశాలు వర్తిస్తాయని సబిత చెప్పారు.

విద్యార్ధులకు గతంలో మాదిరిగానే ఆన్‌లైన్ తరగతులు యథావిథిగా కొనసాగుతాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విధిగా మాస్క్‌లు ధరించడం, శానిటైజేషేన్, భౌతికదూరం పాటించాలని ఆమె కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios