ఉప్పల్ లో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ వద్ద విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

 మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు స్కూల్ ముందే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

అత్యంత వేగంగా లారీ దూసుకురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన ఓ విద్యార్థిని  మొయినుద్దీన్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులు భాష్యం స్కూల్ కి చెందినవారుగా గుర్తించారు.