వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో ప్రయానిస్తున్న ఓ స్కూల్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి విద్యార్థులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 

వర్ధన్నపేటలోని అరబిందో స్కూల్ బస్సు ఈ ప్రమాదానికి గురయ్యింది. విద్యార్థులను తరలిస్తుండగా పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ బస్సును వెనుక వైపునుండి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 13 మంది విద్యార్థులు ఉన్నారు. 

ప్రస్తుతం గాయపడిన విద్యార్థులు ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తూ కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

 వర్ధన్నపేటలో స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు (ఫొటోలు)