లగ్జరీ కార్లే అతడి లక్ష్యం. మంచి కారు కనిపిస్తే చాలు దాని డోర్ ను డూప్లికేట్ కీ తో ఓపెన్ ఎత్తుకెళ్లిపోవడమే అతడి వృత్తి. ఇలా ఇప్పటి వరకు 60 కార్లను దొంగింలించాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు.  

ల‌గ్జ‌రీ కార్ల‌ దొంగ స‌త్యేంద‌ర్ సింగ్ షెకావ‌త్ ను ఎట్ట‌కేల‌కు బంజారహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగ‌ళూరు నుంచి పీటీ వారెంట్ పై అత‌డిని హైద‌రాబాద్ కు తీసుకొచ్చారు. MBA గ్రాడ్యుయేట్ అయిన షెకావత్, బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోట‌ల్ లో కన్నడ సినీ నిర్మాత మంజునాథ్ కు సంబంధించిన ఒక ఫార్చ్యూన‌ర్ కారును గ‌తేడాది దొంగిలించాడు. నిర్మాత కారుతో పాటు నగరంలో ప‌లు ప్రాంతాల నుంచి ఐదు కార్లను చోరీ చేశాడు. సిటీ పోలీసులు అతనిని రెండు పట్టుకోట్టువడానికి ప్రయత్నించి విఫలమ‌య్యారు. అయితే బెంగ‌ళూరు పోలీసులు చివరకు అతడిని స్వస్థలమైన జైపూర్ నుంచి గత నెలలో అతడిని పట్టుకోట్టుగలిగారు. 

2021 జనవరిలో బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 2 లో ఉన్న ఒక స్టార్ హోటల్ నుంచి ట‌యోట ఫార్చ్యూనర్ దొంగ‌త‌నం నేప‌థ్యంలో షెకావ‌త్ మొద‌టి సారిగా హైద‌రాబాద్ పోలీసులు దృష్టిలో ప‌డ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించిన బంజారాహిల్స్ పోలీసు బృందం జైపూర్లోని అతడి ఇంటికి వెళ్లింది. అయితే షెకావత్ ఇంట్లో లేకపోవడంతో అత‌డి భార్య‌, తండ్రితో మాట్లాడారు. అక్క‌డే ఒక వారం పాటు వేచి ఉన్నారు. దీంతో షెకావత్ పోలీసులను సంప్రదించాడు. తాను లొంగితాన‌ని కానీ త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని అభ్య‌ర్థించారు. 

లొంగిపోతాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ అత‌డు తాను చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకోలేదు. ‘ మీకు చేతనైతే నన్ను పట్టుకోండి’ అంటూ సందేశాలు పంపింస్తూ పోలీసులను ఆట‌ప‌ట్టించాడు. దీంతో పోలీసులు ఖాళీ చేతుల‌తో వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. మ‌రో సారి రాచకొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని నాచారం పోలీసులు జైపూర్ కు వెళ్లి నిందితుడికి స‌హ‌క‌రించార‌నే కార‌ణంతో షెకావ‌త్ భార్య‌ను అరెస్టు చేశారు. అయితే అక్క‌డి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నాచారం పోలీసులు కూడా రిక్తహక్తస్తాలతో తిరిగి రావాల్సి వచ్చింది. 

బంజారాహిల్స్ పోలీసులు అత‌డిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలోనూ షెకావత్ హైద‌రాబాద్ కు వ‌చ్చాడు. 2021 ఏప్రిల్ లో నాచారంలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంటి నుంచి ఇసుజు పికప్ ట్రక్కులో వెళ్లిపోళ్లియాడు. అయితే ఎట్ట‌కేల‌కు బెంగళూరు పోలీసులు గత నెలలో జైపూర్ కు వెళ్లి షెకావత్ ను అరెస్టు చేశారు. పీటీ వారెంట్ పై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి నగరానికి తీసుకొచ్చారు. “ అతను కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆన్ లైన్ లో కార్ లాక్ కీ ఫ్రీక్వెన్సీ స్కా నర్లు, కార్ కీ ప్రోగ్రామింగ్ పరికరాలు, కీ కట్టిం గ్ గాడ్జెట్ ల‌ను కొనుగోలు చేశాడు. ఒరిజినల్ కీ ఫ్రీక్వెన్సీ ని స్కా న్ చేసి డూప్లికేప్లిట్ కీలను సిద్ధం చేసి కార్లనుర్ల దొంగిలించాడు. అత‌డు దేశ‌వ్యాప్తంగా 60 కి పైగా కార్లను దొంగిలించాడు. ’’ అని బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కె.నాగేశ్వర్ రావు తెలిపారు. హైదరాబాద్ లో ఐదు కార్లు చోరీ చేశాడని వెళ్లడించారు.