Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలు: రవీందర్ సింగ్ వ్యూహాత్మకం.. కాంగ్రెస్ ఓట్లపై ఫోకస్, జీవన్‌రెడ్డితో మంతనాలు

స్దానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి‌గా బరిలోకి దిగిన కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ (sardar ravinder singh) తన ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈ మేరకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. 

sardar ravinder singh meets congress leader jeevan reddy over mlc elections
Author
Hyderabad, First Published Nov 28, 2021, 2:25 PM IST

స్దానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి‌గా బరిలోకి దిగిన కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ (sardar ravinder singh) తన ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈ మేరకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సీనియర్ కాంగ్రెస్ (congress) నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని (jeevan reddy) కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో లేనందున తనకు అనుకూలంగా ఓట్లు వేయించాలని ఆయన ఆభ్యర్థించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచిన తనకు అండగా నిలిచి తన గెలుపునకు సహకరించాలని రవీందర్ సింగ్ కోరారు. దీనిపై ఇద్దరు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

కాగా.. నిన్న మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్ .. తెలంగాణ కోసం.. టీఆర్ఎస్ (trs) కోసం అహర్నిశలు కృషి చేసిన తననే కోవర్ట్ అంటారా అంటూ ఫైరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ బండారం రోజుకొకటి బెయటపెడ్తానని హెచ్చరించారు. నా నామినేషన్ తిరస్కరించే కుట్ర చేశారని.. తనను ప్రపోజ్ చేసిన వాళ్లను బెదిరించి ఫోర్జరీ చేశారని కేసు పెట్టించాలని చూశారని రవీందర్ సింగ్ ఆరోపించారు. 

తనకు మద్దతిచ్చిన వారిని భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తే.. వాళ్లు భయపడకుండా ఆ సంతకాలు మావేనని కలెక్టర్ ముందు చెప్పారని ఆయన తెలిపారు. అయినా ఎన్నికల అధికారి మూడు గంటలపాటు ఇబ్బంది పెట్టి చివరికి తన నామినేషన్ ఆమోదించారని రవీందర్ సింగ్ వెల్లడించారు. దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ వాళ్లకు, మంత్రులకు చెప్పాను, నా నామినేషన్ మీద వాళ్ళు దృష్టి పెట్టారంటేనే నేను నైతికంగా విజయం సాధించినట్లేనని ఆయన పేర్కొన్నారు. 

Also Read:నన్ను కోవర్ట్ అంటారా... రోజుకొక బండారం బయటపెడతా : కేసీఆర్‌కు రవీందర్ సింగ్ వార్నింగ్

అర్జునగుట్టలోని ఆలయంలో తనకు ఎమ్మెల్సీ (mlc) ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని రవీందర్ సింగ్ గుర్తుచేశారు. మేయర్ పదవి పోయాక కూడా తన జన్మదినం రోజున కేసిఆర్ (kcr) తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మంత్రుల ముందు, నేతల ముందు చెప్పారని ఆయన వెల్లడించారు. మేయర్‌గా పనిచేసిన తాను కార్పొరేటర్‌గా ఉండనని చెప్పినా.. సీఎం చెప్పడంతో కొనసాగానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన మంత్రి తనను అవమానాలకు గురి చేశారుని రవీందర్ సింగ్ ఆరోపించారు. 

ఉద్యమాన్ని దూషించిన వాళ్లను, ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. మానుకోటలో రాళ్లువిసిరిన కౌశిక్ రెడ్డికి (koushik reddy) ఎమ్మెల్సీ ఇచ్చారని, 24 గంటల్లోపే ఆయనకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులు లేరా? వెంకటరామిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు? ఉద్యమకారులకు పాలనలో అవకాశం ఇస్తే ప్రజల కష్టాలు తీరేలా పని చేస్తారని రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios