Asianet News TeluguAsianet News Telugu

ఈటలపై ఆరోపణలు : రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఫ్లెక్సీ దగ్దం.. !

కరీంనగర్ : రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల మీద విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన కమలాపూర్ లో భారీగా పోలీసు బలగాలు  మోహరించాయి. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పై క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

santosh flexy burnt in kamalapur due to allegations against elala rajender - bsb
Author
Hyderabad, First Published May 1, 2021, 12:44 PM IST

కరీంనగర్ : రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల మీద విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన కమలాపూర్ లో భారీగా పోలీసు బలగాలు  మోహరించాయి. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పై క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యలో ఈటల రాజేందర్ సొంత ఊరైన కమలాపూర్ లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు కమలాపూర్ లో బందో బస్తు చేపట్టినట్టు సమాచారం. 

అయితే, ఈటలపై శుక్రవారం ఆరోపణలు వచ్చిన వెంటనే కమలాపూర్ లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఫ్లెక్సీనీ ఈటల అనుచరులు దగ్దం చేశారు. దీంతో ఈటల అనుచరులు ఆందోళనలు చేపట్టడం కానీ, ఇతరాత్ర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించిన పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు.

కాగా, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడినట్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటి ప్రకారం.. అసైన్డ్ భూములపై కన్నేసిన ఆయన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని జమున హ్యాచరీస్ కోసం పేదలను బెదిరించినట్లుగా ఛానెల్స్ చెబుతున్నాయి.

మంత్రి ఈటెలపై సంచలన ఆరోపణలు, ఫిర్యాదు: వంద ఎకరాల భూకబ్జా...

మా భూములు కాజేశారని.. ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో సుమారు 100 ఎకరాలను ఈటల రాజేందర్ కబ్జా చేశారని వార్తలు వస్తున్నాయి.

130/5,  130/9. 130/10, 64/6  సర్వే నెంబర్లలో ఈటల దౌర్జన్యం చేశారని తెలుస్తోంది. మంత్రితో పాటు ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్ రెడ్డిలపై రైతులు, భూ యజమానులు ఫిర్యాదు చేశారు.

ఈటల భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డి పేరుతో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కుదరదన్నా అధికారులపై మంత్రి ఈటల ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. ఓ పౌల్ట్రీఫాం నిర్మాణం కోసం 100 ఎకరాల దందా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios