సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. అందరూ.. సొంతూళ్లకు పయనమౌతుంటారు. దీని ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు మీద కూడా పడింది. పండగకు ఊరెళ్ల ప్రయాణికులతో మెట్రోలో రద్దీ పెరిగింది. శుక్రవారం సాయత్రం నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్లే మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. 

ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, ఐటీ కంపెనీలకు సెలవలు ప్రకటించారు. దీంతో.. నగరవాసులంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు బయలుదేరారు. దూర ప్రాంతం బస్సులు బయలుదేరదే ఇమ్లిబన్, ఎల్బీనగర్  ప్రాంతాలకు త్వరగా చేరుకునేందుకు..  ఎక్కువ మంది మెట్రో ని ఆప్షన్ చేసుకున్నారు. దీంతో.. మెట్రో రద్దీ పెరిగింది.

ఇదిలా ఉండగా.. ఈ నెలఖారుకి హైటెక్ సిటీకి కూడా మెట్రో రానుంది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసుని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయ్యింది. భద్రతా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెలాఖరున ఈ మెట్రో సర్వీసుని ప్రాంరభించనున్నారు. దీంతో.. అటువైపు ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గనుంది.