సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజ్‌లో విద్యార్థినిల ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతుంది. ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఏడీ నారాయణ రావును డిమాండ్ చేస్తూ విద్యార్థినులు చేస్తున్న ఆందోళన నాలుగో రోజుకు చేరింది.
సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజ్‌లో విద్యార్థినిల ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతుంది. ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఏడీ నారాయణ రావును డిమాండ్ చేస్తూ విద్యార్థినులు చేస్తున్న ఆందోళన నాలుగో రోజుకు చేరింది. ఏడీ నారాయణ రావు ప్రవర్తన తీరు బాగోలేదని.. అర్ధరాత్రుళ్లు లేడీస్ హాస్టల్స్‌లో ఇనెస్పెక్షన్ పేరుతో తమ పట్ల అభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కాలేజ్ ముందు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నారాయణ రావుని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాలేజ్ ఆవరణలో ఆందోళన నిర్వహిస్తూ ఏడీ నారాయణ రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
కాలేజ్‌లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఏడీ నారాయణ రావును సస్పెండ్ చేసేవరకు తమ ఆందోళనను విరమించేది లేదని విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కాలేజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఎంఎన్‌ఆర్ కాలేజ్‌లో విద్యార్థుల చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ మద్దతు తెలిపింది. వారితో కలిసి ఆందోళనకు దిగింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్.. ఇటీవల కాలేజ్‌కు చేరుకున్నారు. నారాయణ రావును వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
