కేసీఆర్ , కేటీఆర్ బంధువులు టీఆర్ఎస్‌లోకి తనను ఆహ్వానిస్తున్నారన్నారు కాంగ్రెస్  సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే మే 25 నుంచి 30వ తేదీ లోపు తాను గాంధీభవన్‌లో ఉంటానో.. టీఆర్ఎస్ భవన్‌లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందన్నారు. అప్పుడే కేసీఆర్ బంధువులకు తన నిర్ణయం చెబుతానన్నారు.

యూపీఏ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ సేఫ్ జోన్‌లో ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగమే వింటానని, మిగతా సగమంతా తన నిర్ణయాలేనని తెలిపారు.

తాను స్వశక్తిగా ఎదిగానని.. పార్టీ బ్యానర్‌పై గెలిచిన నేతను కానన్నారు. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దెబ్బతిందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.