వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం కాదని, తాను పార్టీలో వుండి ఎందుకు ఇబ్బంది పడాలి, కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తన తీరువల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చని.. అందుకే తాను పార్టీ నుంచి దూరం కావాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన స్వభావమన్నారు టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్ సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) . కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi), ఎంపీ రాహుల్ గాంధీలకు (rahul gandhi) లేఖలు రాసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీలో అయినా లొసుగులు, అంతర్గత కలహాలు ఉంటాయని జగ్గారెడ్డి చెప్పారు. తాను కరెక్ట్‌గా వున్నా కాబట్టే .. కరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నానని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి సిస్టమ్‌కు నష్టం చేస్తుంటే.. నష్టం చేస్తున్నాడనే చెబుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాను ఎవరికీ భయపడేది లేదని.. ఎవరికీ జంకేది లేదన్నారు. తాను స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతానని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్ తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం కాదని, తాను పార్టీలో వుండి ఎందుకు ఇబ్బంది పడాలి, కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తన తీరువల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చని.. అందుకే తాను పార్టీ నుంచి దూరం కావాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే నిక్కచ్చిగా మాట్లాడానని.. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని, కాంగ్రెస్‌లోని ఒకవర్గం ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
జగ్గారెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారనే అపవాదు తనకు ఇష్టం లేదని.. రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యల్ని రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ఖండించారని ఆయన గుర్తుచేశారు. తాను పోవాలని అనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమి లేదన్నారు. రోజూ ఈ న్యూసెన్స్ పెట్టుకోవడం ఎందుకని తానే వెళ్లిపోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. మూడు , నాలుగు రోజులు టైమ్ తీసుకుని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారని ఆయన వెల్లడించారు.
తాను మూడు, నాలుగు రోజులు సమయం తీసుకున్నా రాజీనామపై వెనక్కి తగ్గనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్లకు వివరించడానికే కొంత సమయం తీసుకుంటున్నానని... ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, కాస్త ఆగానని ఆయన పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే, మంత్రిని, సీఎంను కలిస్తే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బయటివాళ్లు ఎవరైనా విమర్శిస్తే సరే కానీ, సొంతపార్టీ వాళ్లే విమర్శిస్తారా అని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులతో మాట్లాడితే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఇండిపెండెంట్‌గా వుంటే తాను ఎవరినైనా కలవొచ్చని.. ఇండిపెండెంట్‌గా వున్నప్పుడు అసలు రాజకీయం ఏంటో చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎందుకు పోటీ పెట్టలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది భీష్ములు, దుర్యోధనులు, అర్జునులు వున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోగానే కొత్త పార్టీ పెడతానని జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆ పార్టీకే తానే ప్రెసిడెంట్.. తానే ఎమ్మెల్యే, తానే ఫ్లోర్ లీడర్ అని తెలిపారు.
