రాహుల్ గాంధీ రాజీనామా వెనుక వ్యూహం ఉందన్నారు సంగారెడ్డి  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, రాహుల్ రాజీనామా అంశాలపై స్పందించిన ఆయన.. పార్టీ ప్రక్షాళన చేయాలన్నది రాహుల్ ఉద్దేశ్యమన్నారు.

ఎవరితో పార్టీ ఎదుగుతుంది అనేది ఆయన ఆలోచన అన్నారు. రాజీనామా చేయటం అంటే వెనక్కి తగ్గటం కాదని.. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

గాంధీ కుటుంబం ఓ వ్యవస్ధ అని.. ఆ కుటుంబం ఓ సమాజమన్నారు. గాంధీ కుటుంబాన్ని వ్యక్తులుగా కాక వ్యవస్థగా చూడాలని జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్‌కు సీనియర్లు అవసరమేనని.. అలాగే యువత కూడా ముఖ్యమన్నారు.