టీ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక్క హామీ నెరవేర్చకపోయినా కారు గెలిస్తే.. మళ్లీ కేసీఆర్ కాలర్ ఎగురవేస్తారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ఎండగట్టినా ప్రజలు పట్టించుకోతే తెలంగాణను ఎవరూ కాపాడలేరని జగ్గారెడ్డి అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే.. భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా టీఆర్ఎస్‌కు క్లీన్ చీట్ ఇచ్చినట్లేనని పేర్కొన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే.. తాను ఒక్క పథకం కూడా అమలు చేయనప్పటికీ ప్రజలు గెలిపించారని, ఇక ఏమి చేయకపోయినా ప్రజలు గెలిపిస్తారనే ధీమాతో కేసీఆర్ ఉంటారని ఆయన విమర్శించారు. 

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 23 మంది బరిలో ఉన్నారు. 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. స్క్యూట్నీలో 12 నామినేషన్లను తిరస్కరించారు.

దుబ్బాక ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. మొత్తం 46 నామినేషన్లు దాఖలు చేశారు.  వీరిలో 15 మంది ఇండిపెండెండ్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. ఎనిమిది మంది పలు పార్టీల తరపున పోటీలో ఉన్నారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు, ఆలిండియా ఫార్వర్ఢ్ బ్లాక్ అభ్యర్ధిగా కత్తి కార్తీక, శ్రమజీవి పార్టీ నుండి జాజుల భాస్కర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున సుకురి ఆశోక్ , ఇండియా ప్రజా బంద్ పార్టీ నుండి సునీల్ బరిలో నిలిచారు.

ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా అండర్ప్ సుదర్శన్, రవితేజగౌడ్, అన్న రాజ్, కంటే సాయన్న, కొట్టాల యాదగిరి ముదిరాజ్, కోట శ్యామ్ కుమార్, వేముల విక్రం రెడ్డి,బండారు నాగరాజ్, పీఎం బాబు, బుట్టన్నగారి మాధవరెడ్డి, మోతె నరేష్, రేపల్లే శ్రీనివాస్, వడ్ల మాధవాచారి, సిల్వెరి శ్రీకాంత్ బరిలో నిలిచారు.