Asianet News TeluguAsianet News Telugu

అభినవ అంబేద్కర్: కేసీఆర్ పై సంగారెడ్డి కలెక్టర్ పొగడ్తలు

కేసీఆర్ అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆదివారం నాడు సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Sangareddy Collector Sharath praises on Telangana CM KCR
Author
First Published Sep 18, 2022, 5:35 PM IST

సంగారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్ ను అభివన అంబేద్కర్ అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పొగడ్తలతో ముచెత్తారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని  ఆదివారం నాడు సంగారెడ్డిలో పలు కార్యక్రమాలు  నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ముగించిన తర్వాత నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శరత్ ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్ ను చూడలేదన్నారు. 

కానీ కేసీఆర్ రూపంలో  అంబేద్కర్ ను ఇప్పుడు చూస్తున్నామన్నారు. అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషంగా ఉందని కలెక్టర్ చెప్పారు. దేశ చరిత్రలో ఇది ఒక సంచలన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా ఉందన్నారు. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. 

also read:మంత్రి జగదీశ్ రెడ్డిని ‘‘ బాహుబలి ’’ అన్న సూర్యాపేట ఎస్పీ.. ఆ కలెక్టర్‌‌ను గుర్తుచేస్తూ ఉత్తమ్ సెటైర్లు

తెలంగాణ  అమలు చేస్తున్న కార్యక్రమాలను చూస్తే సీఎం కేసీఆర్ ను అభినవ అంబేద్కర్  అని కలెక్టర్ శరత్ పొగిడారు.పేద దళిత, గిరిజనవర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాదీపంగా మారారన్నారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంత్రి జగదీష్ రెడ్డిని కూడ పొగిడారు. జయహో  మంత్రి జగదీష్ రెడ్డి అంటూ వేదికపైనే ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios