Asianet News TeluguAsianet News Telugu

భవన నిర్మాణం పేరిట రూ. కోట్లలో మోసం.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్, బాధితుల్లో ప్రముఖులు

హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బుధవారం రాయదుర్గం పోలీసులు (rayadurgam police) అదుపులోకి తీసుకున్నారు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేశాడు శ్రీధర్ రావు.

sandhya convention md sridhar rao arrested in cheating case
Author
Hyderabad, First Published Nov 10, 2021, 3:10 PM IST

హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బుధవారం రాయదుర్గం పోలీసులు (rayadurgam police) అదుపులోకి తీసుకున్నారు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేశాడు శ్రీధర్ రావు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌‌పై రాయదుర్గం పోలీసులు చీటింగ్ (cheating case) కేసు నమోదు చేశారు. భవనం అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు కొనుగోలుదారుల నుంచి భారీగా నగదును వసూలు చేసినట్లుగా తేలింది. ఎన్ఆర్ఐ ముక్కామల అప్పారావు, బసవతారకం క్యాన్సర్ (basavatarakam cancer hospital) ఆసుపత్రి ట్రస్ట్ మెంబర్ తులసిని మోసం చేసినట్లు శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి. 28 వేల ఎస్ఎఫ్‌టీ స్పేస్‌కు రూ.15 కోట్లు అడ్వాన్స్ తీసుకుని వెనక్కి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ దగ్గర 12 ఎకరాల భూమికి సంబంధించి మరో వివాదం కూడా శ్రీధర్‌పై వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios