ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య గావించబడ్డ సమత కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ దారుణానికి  పాల్పడిన ముగ్గురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది.  సమత;[ అత్యాచారం, హత్య కేసుకు పాల్పడిన నిందితులు ఎ1 షేక్ బాబు, ఏ2 షాబుద్దీన్, ఏ3 షేక్ ముగ్దుమ్ ‌లకు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

ఈ తీర్పు పట్లు సమత స్వగ్రామానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించడం ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పుతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటే భయపడేలా వుందన్నారు. 

సమత కేసు: కోర్టు హాల్‌లో కన్నీళ్లు పెట్టుకొన్న నిందితులు

ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం ఎల్లపటార్ నవంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు సమతపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అంతటితో ఆగకుండా ఆమెను అతి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తర్వాత ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేశారు. 

ఈ తీర్పు పట్లు బాధిత కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. మృతురాలి భర్త పోలీసులకు, న్యాయ వ్యవస్థకు దన్యవాదాలు తెలిపారు. తమ లాంటి నిరుపేదలకు కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందన్నారు.ఇకపై తన పిల్లలను తల్లి తండ్రి తానే అయి పెంచుకుంటానంటూ  భావోద్వేగానికి  లోనయ్యాడు.

సమత కేసులో దోషులకు ఉరి: పోలీసులకు దండం పెట్టి ఏడ్చిన భర్త

గ్రామస్తులు కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిందంటూ పేర్కొంటున్నారు. దళితులకు, ధనవంతులను అందరికీ ఒకే న్యాయం జరుగుతుందనే విషయం ఈ  తీర్పుతో అర్థమయ్యిందన్నారు. ఇకపై చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు భయం లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చన్న భరోసా లభించిందని గ్రామస్తులు అంటున్నారు.